గురువారం, 14 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: శనివారం, 8 సెప్టెంబరు 2018 (19:10 IST)

శృంగారం తరువాత ఆ పని చేయాలట.. లేకుంటే?

శృంగారమనేది జీవితంలో అతి ముఖ్యమైనది. దంపతుల దాంపత్య జీవితంలో ఇదే ముఖ్య పాత్ర పోషిస్తుంది. సృష్టిలోకి మరో కొత్త ప్రాణిని సృష్టించబడినదే రతి క్రియ. శృంగారంలో పాల్గొనేటప్పుడు మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. లేకుంటే అనారోగ్యాలు సం

శృంగారమనేది జీవితంలో అతి ముఖ్యమైనది. దంపతుల దాంపత్య జీవితంలో ఇదే ముఖ్య పాత్ర పోషిస్తుంది. సృష్టిలోకి మరో కొత్త ప్రాణిని సృష్టించబడినదే రతి క్రియ. శృంగారంలో పాల్గొనేటప్పుడు మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. లేకుంటే అనారోగ్యాలు సంభవించే అవకాశం ఉంటుందట. శృంగారంలో పాల్గొనేటప్పుడు తీసుకోవాల్సిన అతి ముఖ్యమైన జాగ్రత్త ఇదేనట.
 
శృంగారం వల్ల మహిళలకు మూత్రాశయ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే శృంగారంలో పాల్గొనేటప్పుడు వారి వ్యక్తిగత ప్రదేశం వద్ద బాక్టీరియా చేరి అలాగే ఉంటుందట. అందువల్ల శృంగారం అనంతరం ఆ బాక్టీరియా అక్కడ నుంచి మూత్రాశయం వద్దకు వస్తుందట. కాబట్టి ఆ సమయంలో తప్పనిసరిగా మూత్ర విసర్జన చేయాలంటున్నారు వైద్యులు. 
 
లేదంటే ఆ బ్యాక్టీరియా మూత్రాశయంలోపల వరకు వెళ్ళి ఇన్ఫెక్షన్లను కలిగిస్తుందట. కాబట్టి శృంగారంలో పాల్గొన్న తరువాత మూత్ర విసర్జన చేయాలని వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా మూత్ర విసర్జన అనంతరం జననాంగాలను కూడా శుభ్రపరుచుకోవాలి. స్త్రీలే కాదు పురుషులు కూడా ఇలాగే చేయాలి. అయితే శృంగారానికి ముందు మూత్రవిసర్జన మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు.