శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. రాబోయే చిత్రాలు
Written By srinivas
Last Modified: మంగళవారం, 4 సెప్టెంబరు 2018 (16:59 IST)

నాట‌క‌మా..? నాక‌ట‌మా..? జుర్రేసుకుంటున్నారు...

ఆర్ఎక్స్ 100 సినిమా ట్రైల‌ర్‌లో లిప్ లాక్ సీన్స్ చూపించ‌డం... ఈ సినిమా సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డంతో.. ఇప్పుడు అంతా దానిపైనే దృష్టి పెట్టారేమో అనిపిస్తుంది. తాజాగా నాట‌కం అనే మూవీ ట్రైల‌ర్ రిలీజైంది. ఇందులో ఆశిష్‌ గాంధీ, ఆషిమా హీరోహీరోయిన్లుగా న‌టించారు

ఆర్ఎక్స్ 100 సినిమా ట్రైల‌ర్‌లో లిప్ లాక్ సీన్స్ చూపించ‌డం... ఈ సినిమా సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డంతో.. ఇప్పుడు అంతా దానిపైనే దృష్టి పెట్టారేమో అనిపిస్తుంది. తాజాగా నాట‌కం అనే మూవీ ట్రైల‌ర్ రిలీజైంది. ఇందులో ఆశిష్‌ గాంధీ, ఆషిమా హీరోహీరోయిన్లుగా న‌టించారు. రిజ్వాన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌ సమర్పణలో కల్యాణ్‌ జి. గోగణ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఆర్ఎక్స్ 100 స‌క్స‌స్ కావ‌డంతో ఆ స్థాయిలో సినిమాను తీసార‌నేలా ఉంది ట్రైల‌ర్.
 
ఈ ట్రైల‌ర్ చూసిన‌వాళ్లు నాట‌కం కాదు.. నాక‌టం అని పెట్టాల్సింది అంటున్నారు. అలా ఉంది ట్రైల‌ర్‌లో నోట్లో నోరు పెట్టి జుర్రేయ‌డం. ఏదో ఆర్ఎక్స్ 100 స‌క్స‌ెస్ అయ్యింది క‌దా అని అలాగే సినిమా తీస్తే చూసేయ‌డానికి ప్రేక్ష‌కులు సిద్ధంగా వున్నారని అనుకుంటున్నారేమోమ మరి. మొత్తానికి అదే దారిలో వెళ్లార‌నిపిస్తోంది. మ‌రి... నాక‌టం.. కాదు కాదు నాట‌కం ఎలాంటి ఫ‌లితాన్ని ఇస్తుందో..?