ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 26 జూన్ 2017 (15:12 IST)

డ్యూటీకని వెళ్లి మామిడితోటలో శవమై తేలాడు... ఎలా?

విధులకు వెళుతున్నట్టు చెప్పి మామిడి తోటలోకి వెళ్లిన ఓ వ్యక్తి చివరకు శవమై తేలాడు. ఓ మహిళతో సాగిస్తున్న వివాహేతర సంబంధమే అతని హత్యకు కారణమై ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని కొమర

విధులకు వెళుతున్నట్టు చెప్పి మామిడి తోటలోకి వెళ్లిన ఓ వ్యక్తి చివరకు శవమై తేలాడు. ఓ మహిళతో సాగిస్తున్న వివాహేతర సంబంధమే అతని హత్యకు కారణమై ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని కొమరంభీం జిల్లా జైపూర్ మండలంలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
జైపూర్ మండల పరిధిలోని దుబ్బపల్లికి చెందిన రాంటెంకి క్రిష్ణ(32) అనే వ్యక్తి లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈయనకు కావ్య అలియాస్‌ పద్మ ఉంది. అదేసమయంలో ఓ మహిళతోనూ వివాహేతర సంబంధం ఉన్నట్టు సమాచారం. ఈ క్రమంలో భర్త ప్రవర్తన నచ్చని పద్మ.. పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత గ్రామ పెద్దలు పంచాయతీ నిర్వహించి భార్యాభర్తలను కలిపారు. 
 
ఈ కారణంగా క్రిష్ణ ప్రవర్తనను వ్యతిరేకిస్తూ భార్య కావ్య అలియాస్‌ పద్మ పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ విషయమై కులపెద్దల సమక్షంలో పలుమార్లు పంచాయితీలు జరిగాయి. కుటుంబ సభ్యులు, కులపెద్దల సూచనల మేరకు కొంతకాలంగా భార్య కావ్యతో కలిసి సోమగూడెం కాసిపేటలో నివాసముంటున్నాడు. లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్న క్రిష్ణ శుక్రవారం డ్యూటికి వెళ్లి 
 
శనివారం రాత్రి డ్యూటీకని చెప్పి వెళ్లిన క్రిష్ణ... సోమగూడెం కాసిపేట్‌కు వెళ్లాల్సివుండగా నేరుగా దుబ్బపల్లికి చేరుకున్నాడు. అక్కడ నుంచి బస్సు సౌకర్యం లేకపోవడంతో లారీ యార్డ్‌లోనే పడుకుంటున్నట్లు భార్య కావ్యకు ఫోన్‌ ద్వారా సమాచారం అందించాడు. అనంతరం దుబ్బపల్లికి చేరుకుని గతంలో వివాహేతర సంబంధం కలిగివున్న మహిళ ఇంటికి వెళ్లి హత్యకు గురై ఉంటాడని కుటుంబ సభ్యులు, స్థానికులు అనుమానిస్తున్నారు. డ్యూటీ నుంచి వచ్చిన క్రిష్ణను పథకం ప్రకారమే హత్య చేసి మామిడి తోటలో పడవేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.