మంగళవారం, 10 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 10 డిశెంబరు 2022 (10:13 IST)

మాండూస్ తుఫాను.. ఏపీ, తమిళనాడు పాఠశాలలకు సెలవులు

mandous cyclone
మాండూస్ తుఫాను ఏపీ, తమిళనాడును అతలాకుతలం చేసింది. చెన్నైతో పాటు ఇతర జిల్లాల్లో మాండూస్ కారణంగా పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. 
 
తమిళనాడులోని మూడు జిల్లాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) బుధవారం రెడ్ అలర్ట్ ప్రకటించింది. మాండూస్ తుఫాను కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది.
 
ఇందులో భాగంగా డిసెంబర్ 10, 2022న కూడా చెన్నై పాఠశాలలకు సెలవు ప్రకటించారు. చెన్నై, తమిళనాడులోని పుదుచ్చేరి, చెంగల్పట్టు, వెల్లూరు, విల్లుపురం, కాంచీపురం, తిరువళ్లూరు, కారైక్కల్ వంటి కొన్ని ప్రాంతాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించడం జరిగింది. 
 
అలాగే దిండిగల్, కొడైకెనాల్‌లలో అలెర్ట్ జారీ చేయబడింది. ఇంకా తిరువళ్లూరు, చెన్నై, కడలూరు, కళ్లకురిచ్చి, తిరువణ్ణామలై, తిరుపత్తూరు, వెల్లూరు, రాణిపేట్ సహా మొత్తం తొమ్మిది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.