ఆదివారం, 17 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 24 ఆగస్టు 2023 (15:29 IST)

తిరుమల అలిపిరి నడక దారిలో చిరుతలు హల్చల్: ఐరన్ ఫెన్సింగ్ వేయాలని కోర్టులో పిటీషన్

leopard
తిరుమల అలిపిరి మార్గంలో ఇటీవల చిరుతపులులు హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో అలిపిరి నుండి తిరుమల వరకు నడకదారిలో ఐరన్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని హైకోర్టులో పిల్ ధాఖలు చేశారు టిటిడి మాజీ బోర్డ్ మెంబర్ భానుప్రకాష్ రెడ్డి. భక్తులను పులుల బారినుండి కాపాడాలని పిల్‌లో ఆయన పేర్కొన్నారు. 
 
చిరుత దాడిలో ప్రాణాలు కోల్పోయిన బాలిక లక్షిత కుటుంబానికి ప్రభుత్వం కోటి రూపాయలు నష్ట పరిహారం చెల్లించాలని పిటిషనర్ డిమాండ్ చేశారు. ఐరన్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసేవిధంగా టిటిడి, ఫారెస్ట్ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని పిల్‌లో పేర్కొన్నారు. పిటిషనర్ తరుపు హైకోర్టులో పిల్ ఫైల్ చేసారు న్యాయవాది యలమంజుల బాలాజీ. ఈ కేసు సోమవారం విచారణకు వచ్చే అవకాశం వుంది.