1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 30 జనవరి 2023 (15:55 IST)

విశాఖ సాగర్ తీరంలో అండర్ వాటర్ టన్నెల్

vizag fish aquarium
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న సముద్రతీర ప్రాంతాల్లో ఒకటైన విశాఖపట్టణంలో సముద్రగర్భంలో చేపల ఆక్వేరియంను నిర్మించారు. వివిధ దేశాల్లోని ఎన్నో రకాల చేపలు ఈ అండర్ వాటర్ టెన్నెల్‌లో ఉన్నారు. ఈ అండర్ వాటర్ ఆక్వేరియం వింతలు విశేషాలను ఓసారి పరిశీలిస్తే, 
 
ఈ ఫిష్ టెన్నెల్‌ ఎగ్జిబిషన్ విశేషంగా ఆకట్టుకుంటుంది. దాదాపు 2 వేలకు పైగా వివిధ రకాలైన చేపలు ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా ఆస్కార్ చేపలు ఈ ప్రదర్శనలో హైలెట్‌గా నిలిచాయి. ఈ ఫిష్ టెన్నెల్ ఎగ్జిబిషన్ మూడు నెలల పాటు కొనసాగనుంది. 
 
విశాఖ బీచ్ రోడ్డులోని పోలీస్ మెస్ వెనుక గ్రౌండ్‌లో ఈ ఫిష్ టెన్నెల్‌ను ప్రారంభించారు. ఈ ఆక్వేరియంను చూసేందుకు అనేక మంది ఈ ప్రాంతానికి క్యూకడుతున్నారు. సందర్శకులు తమ వెనుక ఈత కొడుతున్న చేపలతో సెల్ఫీలు దిగుతూ మురిసిపోతున్నారు. ఎలక్ట్రిక్ ఈల్స్, స్టార్ ఫిష్, హనీమూన్ ఫిష్ వారిని మరింతగా ఆకర్షిస్తున్నాయి.