బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 12 ఆగస్టు 2021 (11:00 IST)

మద్యం మత్తులో బావమరిదిని హత్యచేసిన బావ

మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలోని దుండిగల్‌ పరిధిలోని సూరారంలో దారుణం జరిగింది. మద్యం మత్తులో బావమరిదిని హత్యచేశాడో బావ. సూరారంకు చెందిన మైసయ్య, ఆంజనేయులు బావ బావమర్దులు. బుధవారం రాత్రి ఇద్దరు కలిసి సూరారంలోని దయానంద్‌నగర్‌లో మద్యం సేవించారు. 
 
ఈ సందర్భంగా ఓ విషయంపై ఇద్దరిమధ్య లొల్లి జరిగింది. అదికాస్త గొడవగా మారింది. ఈ క్రమంలో ఆవేశంతో ఉన్న ఆంజనేయులును మైసయ్య కత్తితో పొడిచాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆంజనేయులు మృతిచెందాడు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడిని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.