సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 20 అక్టోబరు 2016 (08:54 IST)

ప్రేమ పెళ్లికి ఒప్పుకోలేదనీ... సెలైన్ బాటిల్‌లో విషం ఎక్కించుకుని వైద్య విద్యార్థి సూసైడ్

ఓ వైద్య విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. తల్లిదండ్రులు ప్రేమ పెళ్లికి ఒప్పుకోలేదన్న కోపంతో విషయాన్ని సెలైన్ బాటిల్‌లో ఎక్కించి, దాన్ని శరీరంలోకి ఎక్కించుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ వివరాలను పరిశీ

ఓ వైద్య విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. తల్లిదండ్రులు ప్రేమ పెళ్లికి ఒప్పుకోలేదన్న కోపంతో విషయాన్ని సెలైన్ బాటిల్‌లో ఎక్కించి, దాన్ని శరీరంలోకి ఎక్కించుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ వివరాలను పరిశీలిస్తే.... 
 
తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన చంద్రశేఖర్‌ కుమార్తె గుండాల శ్రావణి (25) కోఠి ఉస్మానియా మెడికల్‌ కళాశాలలో అనిస్థిషియాలో పీజీ కోర్సు చేస్తోంది. జాంబార్‌లోని ఓ గది అద్దెకు తీసుకొని ఉంటుంది. కొన్నాళ్ల క్రితం ఓ యువకుడితో పరిచయం.. ప్రేమగా మారింది. తల్లిదండ్రులకు తెలియడంతో ఆమెను తీవ్రంగా మందలించారు. 
 
ప్రేమ వివాహానికి ఒప్పుకోమని చెప్పారు. దీంతో మనస్థాపానికి గురైన శ్రావణి బుధవారం సాయంత్రం తన గదిలోని స్నేహితలంతా బయటకెళ్లి తర్వాత విషపు ఇంజెక్షన్‌ను ఓ సెలెన్‌ బాటిల్‌లోకి ఎక్కించింది. 
 
దాన్ని తన శరీరంలోకి ఎక్కించుకుంది. తిరిగొచ్చిన స్నేహితులు ఆమె అపస్మారక స్థితిలో ఉండటం గమనించి వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే శ్రావణి మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. అఫ్జల్‌గంజ్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.