శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 4 నవంబరు 2022 (10:29 IST)

పవన్ ఇంటి వద్ద రెక్కీ.. మంత్రి జోగి రమేష్ ఏమన్నారంటే?

jogi ramesh
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ ఇంటి దగ్గర రెక్కీ అంశంపై స్పందించారు మంత్రి జోగి రమేష్. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఎవరిపై రెక్కీలు నిర్వహించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. 420 బ్యాచ్ రెక్కీ చేస్తున్నారంటూ సెటైర్లు వేశారు. వైకాపా శత్రువును కూడా బాగుండాలని భావిస్తుందని చెప్పారు.  
 
పనిలో పనిగా ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడును టార్గెట్ చేశారు. చంద్రబాబు వృద్ధ నారా పతివ్రత అంటూ ఘాటుగా స్పందించారు. విలువలు, విశ్వసనీయత, రాజ్యాంగం ప్రజాస్వామ్యం, అని బాబు తెగ చెబుతున్నారు... అయ్యన్న అక్రమించుకుంటే. అరెస్ట్ చేస్తారా? అని బాబు చెప్పడం సబబేనా అంటూ వ్యాఖ్యానించారు. ఆక్రమణ తప్పు కాదా..? అని నిలదీశారు.
 
ఫోర్జరీ డాక్యుమెంట్ క్రియేట్ చేయడం తప్పే అని చెప్పి.. ఊగిపోతు మాట్లాడుతున్నారు.. టీడీపీకి సొంత రాజ్యాంగం ఏమైనా రాశారా? అని ఎద్దేశా చేశారు.