ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 4 జనవరి 2020 (08:02 IST)

మానవత్వం చాటుకున్న మంత్రి పేర్ని నాని

రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితుడికి సాయమందించి తన వాహనంలో ఆస్పత్రికి తరలించి దగ్గరుండి చికిత్స చేయించి తన మానవత్వం చాటుకొన్నారు  రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ).  
 
శుక్రవారం  పోరంకి  సమీపంలోని సైకిల్‌పై వెళ్తున్న గింజూరి రామారావు  అనే వృద్ధిడిని కారు  ఢీకొట్టింది. బాధితుడు గాలిలో పైకెగిరి  కారు అద్దాలపై పడటంతో నడుం,కాళ్ళకు బలమైన గాయాలు తగిలాయి. ఈ ప్రమాటం జరిగి  పావుగంట సమయం గడిచినప్పటికీ  క్షతగాత్రుడిని ఏ ఒక్కరు ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయలేదు.

రోడ్డుపై బాధితుడు రోధిస్తున్నాడు. అదే సమయంలో ఏలూరులో ముఖ్యమంత్రి ఆరోగ్య శ్రీ కార్యక్రమమంలో పాల్గొని విజయవాడ మీదుగా మచిలీపట్నం వెళుతున్న మంత్రి పేర్ని నాని ఈ బాధితుడిని గుర్తించారు.  వెంటనే  తన కాన్వాయిని నిలిపి ప్రమాదం ఎలా జరిగిందని స్థానికులను అడిగి తెలుసుకున్నారు.

సెక్యూరిటీ సాయంతో బాధితుడ్ని తన వాహనంలోనే ఆస్పత్రికి తరలించారు. వైద్యానికి అయ్యే ఖర్చు చెల్లించి  దగ్గరుండి వైద్యం చేయించారు.   బాధితుడు కొద్దిగా  కోలుకున్న తర్వాత అక్కడి నుంచి ఆయన వెళ్లారు. మంత్రి పేర్ని నాని కనబర్చిన  మానవత్వం అందరికి ఆదర్శం అని స్థానికులు  ప్రశంసలు కురిపిస్తున్నారు.