1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 27 ఫిబ్రవరి 2015 (19:04 IST)

చిరుధాన్యాలతో ఆరోగ్యానికి ఎంతో మేలు: మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి

నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో చిరు ధాన్యాల ప్రదర్శనను వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చిరుధాన్యాలు తినడం వల్ల ఆరోగ్యవంతమైన జీవనం సాగించవచ్చని పోచారం చెప్పారు. మార్చి 1వ తేదీ వరకు చిరుధాన్యాల ప్రదర్శన జరుగుతుందని వెల్లడించారు. నగరాల్లో వీటి వినియోగాన్ని పెంచటంతో రైతులు పండించిన చిరుధాన్యాల పంటకు తగిన ఆదాయం వస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు.
 
ఇక ముందు కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇలాంటి ప్రదర్శనలు ఏర్పాటు చేస్తామని పోచారం పేర్కొన్నారు. చిరుధాన్యాల ఉత్పత్తులు, ప్రాధాన్యాలపై 60 స్టాళ్లు ఏర్పాటు అయ్యాయని ఆయన తెలిపారు. 
 
చిరుధాన్యాల (మిల్లెట్) సాగును ప్రోత్సహించేందుకు, ప్రజలకు ఆరోగ్యకరమైన పౌష్టికాహారం అలవాటు చేసేందుకు వ్యవసాయశాఖ, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ హోంసైన్స్ విభాగం ఆధ్వర్యంలో తెలంగాణ చిరుధాన్యాల ప్రదర్శన-2015 నిర్వహిస్తున్నట్లు తెలిపారు.