గురువారం, 18 జులై 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 7 మే 2024 (18:34 IST)

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

kovai sarala
హీరో అల్లు అర్జున్ "పుష్ప" చిత్రంలో ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయారు. ఆయనను ఫాలో అవుతున్న ఫ్యాన్స్‌లో చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఉన్నారు. పైగా, అమ్మాయిలు అయితే అల్లు అర్జున్‌ను అమితంగా ఇష్టపడుతున్నారు. అలాంటి అల్లు అర్జున్‌ను వివాహం చేసుకుంటానని తమిళ చిత్రపరిశ్రమలో మోస్ట్ బ్యాచిలర్‌గా ఉన్న నటి కోవై సరళ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 
 
ఓ టీవీలో ప్రసారమైన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ తన పెళ్లి ప్రస్తావన తెచ్చింది. తాను పెళ్లి చేసుకోలేదనీ, తప్పకుండా చేసకోవాలనేం లేదు కదా అని అన్నారు. ఒకవేళ కోవై సరళ పెళ్లి చేసుకోవాలనుకుంటే, ఇపుడున్న టాలీవుడ్ హీరోలలో ఎవరు కావాలి అని యాంకర్ అడిగితే.. అందుకు ఆమె ఫక్కున నవ్వేస్తూ అల్లు అర్జున్ అంటూ ఏమాత్రం ఆలోచన చేయకుండా సమాధానం చెప్పారు. ఓ పుష్ప కావాలా అంటూ యాంకర్ మరింత నవ్వించారు. 
 
అంతేకాకుండా, తాను సినీ రంగంలోకి అడుగుపెట్టిన కొత్తల్లో కమల్ హాసన్ సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్ రావడం గొప్ప అదృష్టమన్నారు. తన కోసం ఆయన 3 నెలల పాటు వెయిట్ చేయడం అంతకంటే గొప్ప విషయమన్నారు. తన అభిమాన దర్శకుడు పూరి అని 'దేశముదురు' సినిమాలోని పాత్రతో తనకు మంచిపేరు తెచ్చిపెట్టిందన్నారు.