గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 7 మే 2024 (15:56 IST)

చీరలో అలరిస్తున్న Alia.. వాకింగ్ ఫారెస్ట్.. సబ్యసాచి చీరలో అదుర్స్

Alia Bhatt
Alia Bhatt
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ఈ సంవత్సరం మెట్ గాలా రెడ్ కార్పెట్‌ను షేక్ చేసింది.  గంగూబాయి కతియావాడి నటి అయిన అలియాభట్ అద్భుతమైన పూల చీరలో కనిపించింది. ప్రస్తుతం ఈ చీర గురించే నెట్టింట చర్చ సాగుతోంది. 
 
మెట్ గాలా "గార్డెన్ ఆఫ్ టైమ్" థీమ్‌కు మంత్రముగ్ధులను చేసే పుదీనా ఆకుపచ్చ శారీపై సున్నితమైన ఎంబ్రాయిడరీ వాకింగ్ ఫారెస్ట్‌ను పోలి ఉండే వర్క్ అదిరిపోయింది. దీనికి తగిన ఆభరణాలు మెరిసే వేలి ఉంగరాలతో ఆ లుక్ భలేగుంది. 
 
మెట్ గాలాలో అలియా నిజమైన భారతీయ ఫ్యాషన్ ఐకాన్ లాగా కనిపించింది. అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.