గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 7 మే 2024 (12:11 IST)

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

Allu Arjun
Allu Arjun
స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన క్లాసిక్ ఫిల్మ్ 'ఆర్య' 20వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సినిమా "నా జీవిత గమనాన్ని" మార్చివేసిందని బన్నీ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా సుకుమార్ 2004 ఆర్య క్లాసిక్ పోస్టర్‌ను షేర్ చేసారు.
 
20 ఇయర్స్ ఆఫ్ ఆర్య. ఇది కేవలం సినిమా మాత్రమే కాదు... ఇది నా జీవిత గమనాన్ని మార్చిన ఒక క్షణం. ఇందుకు కృతజ్ఞతలు తెలుపుతూ చెప్పుకొచ్చారు. అనురాధ మెహతా కూడా నటించిన రొమాంటిక్ యాక్షన్ కామెడీ 'ఆర్య' అల్లు అర్జున్ ఉత్తమ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. 
Allu Arjun
Allu Arjun
 
ఇది అల్లు అర్జున్ కెరీర్‌లో ఉన్నత శిఖరానికి అందుకునేందుకు ఉపయోగపడింది. ఇక ఈ చిత్రానికి 'ఆర్య 2' అనే సీక్వెల్ కూడా వచ్చింది. ఇది 2009లో విడుదలైంది.  
 
కాగా ప్రస్తుతం భారతదేశంలోని అతిపెద్ద స్టార్‌లలో ఒకరైన అల్లు అర్జున్, 2021లో విడుదలైన బ్లాక్‌బస్టర్ 'పుష్ప: ది రైజ్'కి సీక్వెల్ అయిన 'పుష్ప: ది రూల్' విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. రెండు చిత్రాలకు సుకుమార్ దర్శకత్వం వహించడం విశేషం.  
Allu Arjun
Allu Arjun