గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 7 మే 2024 (19:43 IST)

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

Raayan  dhanush look
Raayan dhanush look
తమిళ స్టార్ ధనుష్ నటిస్తున్న తాజా సినిమా రాయన్. ఈ సినిమా గురించి తాజా అప్ డేట్ వచ్చింది.  మే 9వ తేదీ నుండి  అడంగాథా అసురన్  రాయణ్ ఫస్ట్ సింగిల్‌ని కలిసే సమయం వచ్చింది! అంటూ చిత్ర యూనిట్ ప్రకటన విడుదల చేసింది. ఇందులో సందీప్ కిషణ్ కూడా నటిస్తున్నాడు. మలయాళ నటుడు కాళిదాస్ జయరామ్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ధనుష్ ఇందులో మటన్ కొట్టు రాయన్ గా నటిస్తుేన్నట్లు ఇంతకుముందు లుక్ విడుదల చేశారు.
 
రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా తాజా పోస్టర్ ను నేడు విడుదల చేశారు. పది తలల రావణాసురుడు కటౌట్ ఎదురుగా ధనుష్ నడుస్తున్న స్టిల్ ఆసక్తికరంగా వుంది. ఇక ఈ సినిమాలో అపర్ణ బాలమురళీ, విష్ణు విశాల్, ఎస్.జె సూర్య తదితరులు నటిస్తున్నారు. దీనికి ధనుష్ దర్శకుడు. జూన్ 2024 నుండి రాయాన్ సినిమా థియేటర్లలోకి వస్తుంది.