ఆదివారం, 8 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 11 మే 2022 (16:09 IST)

నారాయణ అరెస్టుపై స్పందించిన మంత్రి రోజా

rk roja
ఏపీలో పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ కేసులో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పి.నారాయణ అరెస్టుపై ఆ రాష్ట్ర పర్యాటక శాఖామంత్రి ఆర్కే.రోజా స్పందించారు. బుధవారం నుంచి ప్రారంభమైన గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నారాయణ, చైతన్య విద్యాసంస్థల నుంచి ఎస్‌ఎస్‌సీ ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని, విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్నారని మండిపడ్డారు.
 
ఈ కేసుకు సంబంధించి అరెస్టయిన వారు నారాయణ, చైతన్య పాఠశాలలకు చెందిన వారని ఆమె తెలిపారు. నారాయణ, చైతన్య యాజమాన్యానికి తగిన గుణపాఠం చెప్పాలని విద్యార్థుల తల్లిదండ్రులను ఆమె కోరారు. 
 
మరోవైపు గడప గడపకు వైకాపా అనే కార్యక్రమంలో పాల్గొన్న వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు నిరసన సెగ తప్పడం లేదు. అనేక ప్రాంతాల్లో వైకాపా నేతలు ఘెరావ్ చేస్తుంటడంతో వారు తోకముడుచుకుని పారిపోతున్నారు.