ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , బుధవారం, 29 డిశెంబరు 2021 (17:36 IST)

నక్సలిజం, టెర్రరిజం తగ్గింది....ఇక‌ తగ్గాల్సింది లోకల్ మాఫియా!

నెల్లూరు ఎమ్మెల్యే ఆనం రామ నారాయ‌ణ రెడ్డి సంచలన వ్యాఖ్య‌లు చేశారు. స్థానికంగా హోం గార్డుల కార్య‌క్ర‌మంలో ఆయ‌న మాట్లాడుతూ, మాఫియాలపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో నక్సలిజం, టెర్రరిజం తగ్గింద‌ని, ఇక త‌గ్గాల్సింది ఏదైనా వుందంటే లోకల్ మాఫియాలు అని చెప్పారు. మాఫియాలు ఈ ప్రభుత్వంలోనే కాదు, గత ప్రభుత్వంలోనూ ఉన్నాయని, ఈ మాఫియాల్లో పోలీసుశాఖవాళ్ళు కూడా కలిసి ఉన్నార‌ని చెప్పారు.
 
ప్రజల్లో పోలీసులపై ఒక న్యాయం చేస్తారని నమ్మకం, భరోసా ఉంద‌ని, ఇక పోలీసులే మాఫియాల్లో కలిస్తే... దేశంలో, రాష్ట్రంలో సామాన్యులకు భద్రత ఉండద‌ని ఎమ్మెల్యే చెప్పారు. పోలీస్ వ్యవస్థను బలోపేతం చేయాలంటే, కలుపు మొక్కలను తీసివేయాల‌ని ఎమ్మెల్యే ఆనం సూచించారు.