ఇక బాంబులు, కత్తులూ వస్తాయ్: లోకేశ్
చంద్రబాబునాయుడు రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో పర్యటించినప్పుడు లేని శాంతిభద్రతల సమస్య.. విశాఖకు వచ్చినప్పుడు మాత్రం ఎలా వస్తుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ప్రశ్నించారు.
ప్రభుత్వం, పోలీసుల సహకారంతోనే వైసీపీ కార్యకర్తలు చంద్రబాబు పర్యటనను అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు.
ప్రశాంతమైన విశాఖలో చెప్పులు, కోడిగుడ్లతో దాడులు ప్రారంభించిన వైసీపీ.. బాంబులు, కత్తులు తీసుకొచ్చేందుకు కూడా ఎంతోకాలం పట్టదని లోకేశ్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఆందోళనకారుల్లో అత్యాచారాల నిందితులు ఉండటం ఈ పరిస్థితికి నిదర్శనమని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలకు సహకరిస్తున్న పోలీసులందరి పేర్లూ రాసుకుంటున్నామని హెచ్చరించారు. విశాఖలో త్వరలోనే ప్రజాచైతన్య యాత్ర నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు.