'వైసీపీ భాషలో నీ అమ్మ మొగుడు ఎవరు అని అడుగుతారు': లోకేష్

lokesh
ఎం| Last Updated: మంగళవారం, 18 ఫిబ్రవరి 2020 (09:02 IST)
"ఎవరైనా మీ నాన్న ఎవరు అని తెలుగులో అడుగుతారు, అలాగే
హూ ఈజ్ యువర్ ఫాదర్ అని ఇంగ్లీష్‌లో అడుగుతారు.. కానీ వైసీపీ భాషలో నీ అమ్మ మొగుడు ఎవరు అని అడుగుతారు" అని టీడీపీ నేత నారా లోకేష్ అన్నారు.

టిఎన్ఎస్ఎఫ్ మేధోమదన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి వికేంద్రీకరణను ఆనాడే చేసి చూపించామన్నారు. టీడీపీ హయాంలో 9.5 లక్షల ఉద్యోగాలు వచ్చాయని అసెంబ్లీలో ఒప్పుకున్నారని అన్నారు.

జగన్‌ అధికారంలోకి వచ్చాక వైసీపీ కార్యకర్తలకే ఉద్యోగాలు వచ్చాయని, విశ్వవిద్యాలయాలను రాజకీయ వేదికగా మార్చేశారన్నారు.

రాష్ట్రం నుంచి కంపెనీలను తరిమేశారని, తమిళనాడు ప్రభుత్వంతో కియా కంపెనీ ప్రతినిధులు చర్చలు జరిపారన్నారు.
రాష్ట్రంలో నిరుద్యోగ భృతి ఎత్తేశారని.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ లేదని లోకేష్‌ తీవ్రస్థాయిలో విమర్శించారు.
దీనిపై మరింత చదవండి :