బాలకృష్ణ కోసం చంద్రబాబు వైఎస్ కాళ్లు పట్టుకున్నారా: ముద్రగడ అంతమాట అనేసారేంటీ?
రాజకీయాల్లో మాటల్ని విసరడంలో హద్దులు మీరితే ఎవరి పరువూ మిగలదన్నది తెలిసిన విషయమే. మాటలు నోరు దాటితే అది ప్రపంచం అంచువరకూ వెళుతుందన్నదీ సత్యమే. ముద్రగడ, చంద్రబాబు మధ్య జరుగుతున్న ప్రచ్చన్నయుద్ధంలో ప్రస్తుతం ఇదే జరుగుతోంది..
రాజకీయాల్లో మాటల్ని విసరడంలో హద్దులు మీరితే ఎవరి పరువూ మిగలదన్నది తెలిసిన విషయమే. మాటలు నోరు దాటితే అది ప్రపంచం అంచువరకూ వెళుతుందన్నదీ సత్యమే. ముద్రగడ, చంద్రబాబు మధ్య జరుగుతున్న ప్రచ్చన్నయుద్ధంలో ప్రస్తుతం ఇదే జరుగుతోంది.. కాపుల హక్కుల కోసం నిలదీసినందుకు ఇంటిపై దాడిచేసి కుటుంబాన్ని ఘోరంగా అవమానించి పది రోజులకు పైగా ఆసుపత్రిలో నిర్బంధించాడని చంద్రబాబుపై గొంతుకాడికి కోపమున్న మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సందు దొరికితే చాలు బాబుపై ఒంటికాలిపై లేస్తున్నారు.
కాని ఈ ఇద్దరి మధ్య గొడవలో చంద్రబాబు వియ్యంకుడు బాలకృష్ణ అనవసరంగా ఇరుక్కుపోయారా అనిపిస్తుంది. ఈ క్రమంలో ముద్రగడ నోట వచ్చిన మాటలు చంద్రబాబు పరువు కూడా తీస్తున్నట్లే ఉంది.
కాపుల సమస్యపై రాష్ట్ర్రవ్యాప్తంగా ప్రజల్లో ప్రచారం చేయడం కోసం ప్రస్తుతం ముద్రగడ జిల్లాల పర్యటనలో ఉన్నారు. దీంట్లో భాగంగానే రెండు రోజుల క్రితం కర్నూలు పట్టణంలో సత్యాగ్రహ దీక్ష నిర్వహించిన ముద్రగడ చంద్రబాబుపై ఒక రేంజిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కాపులు రోడ్డెక్కేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ప్రధాన కారణమని ముద్రగడ పద్మనాభం ధ్వజమెత్తారు. కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలకు బీసీ రిజర్వేషన్ వర్తింపజేయాలన్న ప్రధాన డిమాండ్‌పై కర్నూలులోని మెగా సిరి ఫంక్షన్ హాలులో సత్యాగ్రహ దీక్ష నిర్వహించిన సందర్భంగా ముద్రగడ మాట్లాడుతూ.. 2014 ఎన్నికల సమయంలో కాపులను బీసీ జాబితాలో చేర్చి రిజర్వేషన్లు కల్పిస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. అవి సాధించే వరకు తాము నిద్రపోమని, బాబుకూ నిద్ర పట్టకుండా చేస్తామన్నారు.
ఇంతవరకూ బాగానే ఉంది. కానీ ప్రతిపక్ష నేత జగన్ సహకారంతోనే తాను ఉద్యమం చేస్తున్నాన ని సీఎం వ్యాఖ్యానించడంపై ముద్రగడ మండిపడ్డారు. బావమరిది బాలకృష్ణను కాల్పుల కేసు నుంచి రక్షించుకునేందుకు అర్ధరాత్రి నెంబరు బోర్డులేని వాహనంలో వెళ్లిన బాబు.. అప్పటి సీఎం వైఎస్ కాళ్లు పట్టుకోలేదా అని ప్రశ్నించారు. ఇది నిజమో కాదో తెలీదుకానీ ముద్రగడ-బాబు మధ్య సైలెంట్ వార్‌లో బాలకృష్ణ బలైపోయాడేంటీ అని ఆయన అభిమానులు వాపోతున్నారు.