శుక్రవారం, 21 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 8 మే 2024 (21:47 IST)

మీ భార్య, మాజీ భార్యలకు ఎమ్మెల్యే టిక్కెట్లు ఇప్పించమంటారా?

pawan - mudragada
వైఎస్సార్‌సీపీ నేత ముద్రగడ పద్మనాభం పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై ఫైర్ అయ్యారు. ఆయనను వ్యక్తిగతంగా దెబ్బతీసేందుకు వైకాపా అధినేత జగన్.. ఆయన భార్యలపై కామెంట్లు చేయగా... ప్రస్తుతం అదే బాటలో ముద్రగడ పద్మనాభం కూడా పయనిస్తున్నారు. 
 
"మిస్టర్ పవన్ కళ్యాణ్, మీకు ఇప్పటి భార్య, మీరు ఇంతకు ముందు విడిచిపెట్టిన ఇద్దరు భార్యలు ఉన్నారు. మీకు అవసరమైతే, నేను వారికి ఎమ్మెల్యే టిక్కెట్లు ఇస్తాను. మీ భార్యకు, మాజీలకు టిక్కెట్లు ఇప్పించమని మా ముఖ్యమంత్రిని అడగమంటారా?" అంటూ ఎద్దేవా చేశారు. 
 
పవన్ కళ్యాణ్, ఆయన వివాహాలు, భార్యల గురించి వైఎస్ జగన్ కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ముద్రగడ కూడా ఇలా పవన్‌పై వ్యక్తిగత విమర్శలకు దిగడంపై పీకే ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇంకా సీనియర్ నేతగా హుందాగా వ్యవహరించాల్సిన ముద్రగడ ఇలాంటి కామెంట్లు చేయడంపై వారు ఫైర్ అవుతున్నారు.