బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 8 మే 2024 (15:54 IST)

అందరినీ గొడ్డలితో నరికేయండి... అపుడు మీరే సింగిల్ ప్లేయర్ : వైఎస్ షర్మిల

ys sharmila
తన అన్న, వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పగబట్టారు. అవకాశం చిక్కిన చోటల్లా ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఆమె కడపలో విలేకరులతో మాట్లాడుతూ, రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కడప లోక్‌‍సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న అవినాశ్ రెడ్డి ఓడిపోతే అరెస్టు తప్పదనే భయంవారిలో నెలకొందన్నారు. ఎంపీగా ఆయన గెలిస్తే నేరం గెలిచినట్టేనని అన్నారు. కడపలో వైకాపా సింగిల్ ప్లేయర్ అంటూ ఇటీవల సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతి చేసిన వ్యాఖ్యలపై షర్మిల మండిపడ్డారు. 
 
వాళ్లే అధికారంలో ఉండాలి వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్నవాళ్లందరిన నరికేయాలి. వాళ్లే సింగిల్ ప్లేయర్ ఉండాలి. భారతి స్ట్రాటజీ ఇదేనా? గొడ్డలితో మిగతా వాళ్లను నరికేయండి. అపుడు మీరే సింగిల్ ప్లేయర్. ప్రజలకు ఎంపీ అందుబాటులో ఉండాలంటే ఓకు ఓటు వేయండి. మీ ఎంపీని జైల్లో కలవాలంటే అవినాష్ రెడ్డికి ఓటు వేయండి. దేవుడు మా వైపే  ఉంటాడు. గొడ్డలితో నరికేవాళ్లు వాళ్ళ వైపు ఉంటారు అని షర్మిల వ్యాఖ్యానించారు. 
 
దక్షిణాది ప్రజలు ఆఫ్రికన్లలా కనిపిస్తారు : శామ్ పిట్రోడా 
 
కాంగ్రెస్ సీనియర్ నేత శామ్ పిట్రోడా వివాస్పద వ్యాఖ్యలు చేశారు. జాతీయ ఐక్యత గురించి వివరించే క్రమంలే ఆయన ఉపయోగించిన భాష పెను రాజకీయ దుమారానికి తెరతీసింది. పిట్రోడా వ్యాఖ్యలపై బీజేపే తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తుంది. 
 
ఆయన తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో దేశంలోని తూర్పు ప్రాంత ప్రజలు (ఈశాన్య) చైనీయుల్లా కనిపిస్తారు. దక్షిణ ప్రాంత ప్రజలు ఆఫ్రికన్లలా కనిపిస్తారు అని చెప్పారు. ఉత్తరాదివారు మాత్రం తెల్ల జాతీయుల్లా కనిపిస్తారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు పెను దుమారానికి దారితీశాయ. బీజేపీ నేతలు శామ్ పిట్రోడాపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. 
 
మణిపూర్ ముఖ్యమంత్రి న్.బీరెన్ సింగ్, అస్సోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మత పాటు బీజేపీ నేతలు తప్పుబట్టారు. శామ్ భాయ్.. నేను దేశఁలోని ఈశాన్య ప్రాంతానికి చెందిన వాడిని. నేను భారతీయుడిలా కనిపిస్తా. మేం చూసేందుకు భిన్నంగా కనిపించొచ్చు. కానీ, మేమంతా ఒక్కటే. దేశం గురించి కనీసం కొంచమైనా అర్థం చేసుకో అంటూ హిమంత బిశ్వ శర్మ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. 
 
మరోవైపు, బాలీవుడ్ నటి, బీజేపీ మహిళా నేత కంగనా రనౌత్ కూడా శామ్ పిట్రోడాపై విరుచుకుపడ్డారు. "రాహుల్ గాంధీ మెంటర్ పిట్రోడా. భారతీయుల గురించి ఆయన చేసి జాతి విద్వేష, విభజన వ్యాఖ్యలు వినండి. వారి సిద్ధాంతమే దేశాన్ని విభజించి పాలించడం. సాటి భారతీయులను చైనీయులుగాను, ఆఫ్రికన్లుగా అభివర్ణించడం దారుణం. ఇందుకు కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నేతలు సిగ్గుపడాలి అటూ ఆమె ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు.