శుక్రవారం, 19 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 8 మే 2024 (15:58 IST)

మా జగనన్న అందుకే లండన్ వెళ్లిపోతున్నాడు: బాంబు పేల్చిన వైఎస్ షర్మిల

ys sharmila
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విదేశీ పర్యటన ఖరారు అయ్యిందో లేదో తెలియదు కానీ మీడియాలో దీనిపై విపరీతంగా వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలను పక్కనబెడితే... ఏకంగా ఆయన సోదరి వైఎస్ షర్మిల ఈ విషయంపై మాట్లాడారు. ఎన్నికల్లో పరాజయం తప్పదని భావించి మా జగన్ మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్లిపోతున్నారంటూ చెప్పుకొచ్చారు.
 
ఊరు దాటి పోవడానికి, ఇక ఓటమిని ఒప్పుకుని అంగీకరించే పరిస్థితికి వచ్చేసారు. నేను ఓడిపోతే నా అరెస్టు ఖాయమని అనుకుని పాస్ పోర్ట్ కూడా సిద్ధం చేసుకుంటున్నారు. అందుకే వాళ్లు విదేశీ ప్రయాణం పేరిట తప్పించుకునే ప్లాన్ చేస్తున్నారు.