బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: మంగళవారం, 9 మే 2017 (20:37 IST)

నీవల్లే ఊరు వల్లకాడైంది... బొజ్జలకు అవమానం

మాజీ మంత్రి బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డికి మరోసారి అవమానం జరిగింది. చిత్తూరు జిల్లా ఏర్పేడులో జరిగిన రోడ్డుప్రమాద మృతుల బంధువులకు ప్రభుత్వం తరపున నష్టపరిహారం ఇవ్వడానికి పరిశ్రమల శాఖామంత్రి అమరనాథ రెడ్డితో కలిసి వెళ్ళిన బొజ్జలను అడ్డుకున్నారు మునగలపాళెం

మాజీ మంత్రి బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డికి మరోసారి అవమానం జరిగింది. చిత్తూరు జిల్లా ఏర్పేడులో జరిగిన రోడ్డుప్రమాద మృతుల బంధువులకు ప్రభుత్వం తరపున నష్టపరిహారం ఇవ్వడానికి పరిశ్రమల శాఖామంత్రి అమరనాథ రెడ్డితో కలిసి వెళ్ళిన బొజ్జలను అడ్డుకున్నారు మునగలపాళెం గ్రామస్తులు. బొజ్జల మైక్ తీసుకుని ప్రసంగం ప్రారంభించే లోపే గ్రామస్తులు నీవల్లే ఊరు వల్లకాడైపోయిందని, అప్పుడే పట్టించుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని బొజ్జలను ప్రశ్నించారు.
 
గ్రామస్తుల మాటలను పెద్దగా పట్టించుకోకుండా బొజ్జల ప్రసంగిస్తుండటంతో మరికొంతమంది పైకి లేచి బొజ్జల ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో మాజీమంత్రి తన ప్రసంగాన్ని మధ్యలో ఆపేసి సైలెంట్‌గా కూర్చుండి పోయారు. మాజీ మంత్రి పక్కనే ఉన్న టిడిపి నేతలు గ్రామస్తులను సముదాయించే ప్రయత్నం చేశారు.