శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 5 డిశెంబరు 2020 (14:01 IST)

నా భర్త అమ్మాయిల పిచ్చోడు, మోసగాడు: పోలీసులకు భార్య ఫిర్యాదు

తన భర్త అమ్మాయిల పిచ్చోడనీ, ప్రేమ పేరుతో యువతులను మోసం చేసి ఆపై వారిని లొంగదీసుకుని బ్లాక్ మెయిల్ చేస్తుంటాడని తన భర్తపై భార్య ఒంగోలులో ఫిర్యాదు చేసింది. భార్య ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.
 
ఆంధ్రా యువతులు, హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఉద్యోగునులే లక్ష్యంగా తన భర్త మోసాలకు పాల్పడటాన్ని హైదరాబాద్ చందానగర్ కాలనీకి చెందిన విజయభాస్కర్ పైన భార్య ఫిర్యాదు చేసింది. కాగా తనకు విజయభాస్కర్ తో 2017లో వివాహమైందనీ, తనకు మూడేళ్ల బాబు కూడా వున్నాడని తెలిపింది.
 
వివాహ సమయంలో 15 లక్షల కట్నంతో పాటు 25 తులాల బంగారాన్ని తన పుట్టింటివారు కట్నంగా ఇచ్చారని పేర్కొంది. తనను ఎలాగైనా వదిలించుకోవాలని తన భర్త ప్రయత్నిస్తున్నాడనీ, తనకు న్యాయం చేయాలంటూ ఆమె పోలీసులను కోరింది.