గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 25 జనవరి 2017 (11:17 IST)

ప్రత్యేకహోదా.. పవన్ కల్యాణ్‌కు సంపూర్ణ మద్దతిస్తా.. ఆర్కే బీచ్ ఆందోళనకు జై: నాగబాబు

జనసేనాని పవన్ కల్యాణ్‌కు ఆయన సోదరుడు, నటుడు నాగబాబు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. పవన్ గురించి ఫ్యాన్స్ అడిగిన ప్రతిసారీ అసహనం వ్యక్తం చేసిన నాగబాబు హోదాపై జరుగుతున్న పవన్ ఆందోళనకు జై కొట్టారు. ప్రత్యేక

జనసేనాని పవన్ కల్యాణ్‌కు ఆయన సోదరుడు, నటుడు నాగబాబు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. పవన్ గురించి ఫ్యాన్స్ అడిగిన ప్రతిసారీ అసహనం వ్యక్తం చేసిన నాగబాబు హోదాపై జరుగుతున్న పవన్ ఆందోళనకు జై కొట్టారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని, ఆ హక్కు కోసం పోరాడుతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు, ఇతర రాజకీయ పార్టీలకు, ఆంధ్రా యూనివర్సిటీ జేఏసీ స్టూడెంట్స్‌కు, మెగా ఫ్యాన్స్‌కు, పవన్ ఫ్యాన్స్‌కు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని నాగబాబు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. 
 
పవన్ కల్యాణ్ ఆదర్శాలతో, అతని ఆలోచనా విధానంతో తాను సంపూర్తిగా ఏకీభవిస్తున్నానని నాగబాబు వీడియో ద్వారా మద్దతు పలికారు. ఇందులో భాగంగా విశాఖ ఆర్కే బీచ్‌లో 26న జరగబోయే శాంతి ర్యాలీకి తన మద్దతు ఉంటుందని నాగబాబు చెప్పారు. తాను ఆర్కే బీచ్ పోరాటానికి మీ వెంటే వుంటానంటూ నాగబాబు స్పష్టం చేశారు. 
 
కాగా.. ప్రత్యేక హోదా సాధన కోసం ఏపీ యువత ఆందోళన చేపట్టాలని పవన్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నెల 26న విశాఖ ఆర్కే బీచ్‌లో జరగబోయే ఆందోళన కార్యక్రమానికి ఇప్పటికే సినీ పరిశ్రమ నుంచి చాలామంది హీరోలు మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా అంశంపై పవన్ మద్దతు తెలపడంపై మెగా బ్రదర్ నాగబాబు హర్షం వ్యక్తం చేశారు.