శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 30 డిశెంబరు 2021 (11:57 IST)

సీఎం జగన్ ఆలోచనలన్నీ పేదల సంక్షేమం కోసమే : ఎమ్మెల్యే రోజా

వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసే ప్రతి ఆలోచన, తీసుకునే నిర్ణయం పేదల సంక్షేమం కోసమేనని ఆ పార్టీకి చెందిన నగరి ఎమ్మెల్యే, సినీ నటి ఆర్కే.రోజా అన్నారు. ఆమె గురువారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నారు. 
 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అన్ని సినిమాలకు ఒకే విధమైన టిక్కెట్ ధరలు ఉంటే పేద, మధ్యతరగతి ప్రేక్షకులంతా సినిమా చూసేందుకు అవకాశం ఉందన్నారు. అందువల్ల సినిమా టిక్కెట్ల ధరల విషయంలో వివాదం వద్దని కోరారు. 
 
ముఖ్యంగా, భారీ బడ్జెట్‌తో సినిమాలు తీసే నిర్మాతలే ఈ సినిమా టిక్కెట్లపై తీవ్ర అభ్యంతరాలు చెబుతున్నారని అన్నారు. టిక్కెట్ ధరలను తగ్గిస్తూ ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయం పేద, మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకునేని ఆమె అన్నారు. 
 
అంతేకాకుండా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వం ఆస్పత్రులను మెరుగుపరిచి, వైద్య సదుపాయాలు పెంచి సామాన్య ప్రజలకు కూడా మెరుగైన వైద్యం అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని ఆమె అన్నారు.