శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 28 మే 2017 (14:31 IST)

వైజాగ్ టీడీపీ మహానాడుకు నందమూరి ఫ్యామిలీ దూరం...

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవాలు విశాఖ సముద్రతీరంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు నందమూరి కుటుంబ సభ్యులెవ్వరూ హాజరుకాలేదు. దీనిపై మహానాడుకు వచ్చిన టీడీపీ కార్యకర్తల్లో ఆసక్తికర చర్చ

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవాలు విశాఖ సముద్రతీరంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు నందమూరి కుటుంబ సభ్యులెవ్వరూ హాజరుకాలేదు. దీనిపై మహానాడుకు వచ్చిన టీడీపీ కార్యకర్తల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా పార్టీలో పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్న నందమూరి హరికృష్ణ కూడా మహానాడుకు దూరంగా ఉన్నారు. 
 
అలాగే, మహానాడు వేదికపై ఆహ్వానితుల జాబితాలో హరికృష్ణ పేరు ఉన్నప్పటికీ, ఆయన రాకపోవడం గమనార్హం. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా ఎక్కడా కనిపించలేదు. గతంలో మహానాడు జరిగినప్పుడు కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్, తారకరత్న తదితరులు వచ్చి సందడి చేసిన సందర్భాలున్నాయి. ఇక ఈ సంవత్సరం తొలి రోజున వీరెవరూ కనిపించలేదు. రెండో రోజున కూడా ఎవరూ రాలేదు.