శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 8 మార్చి 2024 (16:31 IST)

వింగ్స్ టు డ్రీమ్స్... అది చంద్రబాబు, పవన్‌కే సాధ్యం- నన్నపనేని రాజకుమారి

Nannapaneni
వైసీపీ ప్రభుత్వ హయాంలో మహిళల భద్రత తగ్గిపోయిందని, దాన్ని పునరుద్ధరించడం చంద్రబాబు నాయుడు, పవన్‌కల్యాణ్‌కే సాధ్యమని టీడీపీ సీనియర్‌ నేత, మహిళా కమిషన్‌ మాజీ చైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి అన్నారు. 
 
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన ఆమె తొలుత ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు మహిళలకు, తెలుగుదేశం పార్టీ మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
 
మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి మహిళ, ఆడబిడ్డ కలను సాకారం చేసేందుకు ప్రత్యేకంగా "వింగ్స్ టు డ్రీమ్స్" పేరుతో చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ కొత్త పథకాన్ని ప్రారంభించినట్లు నన్నపనేని రాజకుమారి ప్రకటించారు. 
 
ఈ పథకం ద్వారా వారి జీవితాలను ఉన్నత స్థాయికి చేర్చడమే టీడీపీ-జన సేన ప్రభుత్వ లక్ష్యమని నన్నపనేని స్పష్టం చేశారు. ఈ పథకం కింద మహిళలు, బాలికలు పొందే బ్యాంకు రుణాలకు టీడీపీ-జనసేన ప్రభుత్వం గ్యారెంటర్‌గా నిలుస్తుందని ఆమె వివరించారు. 
 
'వింగ్స్ టు డ్రీమ్స్' పథకం కోసం నమోదు చేసుకోవడానికి, 92612 92612కు మిస్డ్ కాల్ ఇవ్వండి లేదా www.kalalakurekkalu.com వెబ్‌సైట్‌కి లాగిన్ కావాల్సి వుంటుంది.