గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 21 సెప్టెంబరు 2023 (16:45 IST)

ఆ కేసులో లోకేశ్ అరెస్ట్ అయితే.. నారా బ్రాహ్మణీ పార్టీని నడుపుతారు..?

Nara Bramhani
ఏపీ ఫైబర్ నెట్ కేసులో లోకేశ్ అరెస్ట్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. నారా లోకేశ్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారని, ఆయన ఏపీకి తిరిగి రాగానే ఎయిర్ పోర్టులోనే అరెస్ట్ చేయాలని చూస్తున్నారని ఆరోపణలు చేశారు. 
 
ఒకవేళ నారా లోకేష్‌ను కనుక అరెస్ట్ చేస్తే నారా బ్రాహ్మణి పార్టీని నడిపిస్తారని తెలిపారు. ఏపీలో ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొన్నాయని అయ్యన్న పాత్రుడు అన్నారు. 
 
పార్టీని నాశనం చేయాలని అనేకమంది ప్రయత్నించారని, వాళ్ల వల్ల కాలేదని చెప్పారు. రాష్ట్ర భవిష్యత్ కోసం తాము దేనికైనా సిద్ధంగా ఉన్నామని తెలిపారు.