అష్టదిగ్బందంనంలో నరసరావుపేట
రాష్ట్రంలోని మొట్టమొదటి కరోనా మరణం సంభవించడంతో రోడ్లపైకి పురుగు కూడా తిరగడం లేదు. రెడ్ జోన్ ఏరియాతో పాటు పట్టణం అంత నిర్మానుష్యంగా తయారైంది.
నిన్నటి వరకు ఎదో ఒక ప్రాంతంలో సంచరిస్తూ పోలీసులు చేత తిట్లు తింటూ తన్నించుకునే బ్యాచ్ లు కూడా ఇటువైపు అసలు రాలేదు.
కరోనా విధులు నిర్వహించే పోలీసులకు, ఈవినింగ్ స్నాక్స్, మార్నింగ్ టిఫెన్ పెట్టేవారు కరువయ్యారు. బట్టర్ మిల్క్, బాదం పాలు, జీలకర్ర నీళ్లు ఇచ్చేవారు. ఏకంగా ఈ రోజు మంచినీళ్ళు ఇచ్చేవారు కూడా లేరు అంటూ సరదాగా చర్చించుకుంటున్నారు.