నయీం కేసులో అరెస్టుల పరంపర.. ఇప్పటికే అర్థ సెంచరీ దాటింది
గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో అరెస్టుల పరంపర కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు సిట్ పోలీసులు దాదాపు 50 మందిని అరెస్టు చేశారు. అయితే నయీంకు అత్యంత కీలకమైన అనుచరులు మరో ఐదుగురు ఉన్నట్లు సిట్ విచారణ
గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో అరెస్టుల పరంపర కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు సిట్ పోలీసులు దాదాపు 50 మందిని అరెస్టు చేశారు. అయితే నయీంకు అత్యంత కీలకమైన అనుచరులు మరో ఐదుగురు ఉన్నట్లు సిట్ విచారణలో వెలుగు చూసింది. వీరి ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
ఆ ఐదుగురు పట్టుబడితే నయీంకు సంబంధించిన పలు కీలక విషయాలు వెలుగు చూసే అవకాశం ఉంది. ఇప్పటికే అరెస్టు చేసిన నిందితుల నుంచి కీలక వ్యక్తులకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులు సేకరించారు. ఈ మేరకు సిట్ పోలీసులు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటకల్లో గాలించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.
మరోవైపు.. నయీం కేసులో ఇప్పటివరకు అరెస్టు చేసిన వారి సంఖ్య 50కి చేరింది. వీరిలో ఎక్కువ మంది నయీం కుటుంబ సభ్యులు లేదా అనుచరులే ఎక్కువగా ఉన్నారు. అయితే, నయీం తన ఆర్మీగా చెప్పుకునే నయీం కుడి భుజం శేషన్నతో పాటు రామన్న, ఖలీమ్, సురేందర్, జహంగీర్ అనే వ్యక్తుల కోసం సిట్ తీవ్రంగా గాలిస్తోంది.