సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 3 అక్టోబరు 2021 (12:38 IST)

నెల్లూరులో గుడిసెలకు నిప్పంటించిన దండగులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా కేంద్రంలో కొందరు దుండగులు వందలాది గుడిసెలకు నిప్పంటిచారు. దీంతో అనేక మంది పేదలు రాత్రికిరాత్రే పేదలైపోయారు. గత కొంతకాలంగా ఆ ప్రాంతంలో దళితులు- రియల్ ఎస్టేట్ వ్యాపారుల వివాదం నెలకొనగా, రాత్రికి రాత్రి గుడిసెలు తగులబడటం అనేక అనుమానాలకు తావిస్తోంది.
 
రాత్రికి రాత్రే గూడు నాశనమైపోవడంతో బాధితుల ఆక్రందనలతో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది. ఫలితంగా గుడిసెలు తగులబడ్డ నెల్లూరు రూరల్ పరిధిలోని నక్కా గోపాల్ నగర్లో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. తగలబడిన గుడిసెలన్నీ పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందినవే కావడం గమనార్హం. 
 
ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకుని నివసిస్తున్న పేద కుటుంబాలపై అకృత్యానికి పాల్పడిన ఆగంతకుల అంతు చూసేవరకూ ఊరుకునేది లేదని బాధితులు శపథం చేస్తున్నారు. దుర్మార్గులపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.