మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 15 సెప్టెంబరు 2021 (14:57 IST)

నెల్లూరులో దారుణం : వ్యభిచారం చేయాలంటూ యువతికి చిత్రహింసలు

జిల్లా కేంద్రమైన నెల్లూరులో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వ్యభిచారం చేయాలంటూ ఓ యువతిని చిత్రహింసలకు గురిచేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. బాధిత యువతిని కర్రతో చికతబాదాడు. ఈ ఘటనపై పోలీసుల స్పందించారు. దారుణంగా హింసించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. 
 
ఈ దాడి చేసిన వ్యక్తిని నెల్లూరు పట్టణంలోని రామకోటయ్య నగర్‌కు చెందిన వెంకటేష్‌గా గుర్తించారు. అలాగే వీడియో తీసిన శివ కుమార్ అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. యువతిని వ్యభిచారం చేయాలంటూ దారుణంగా హింసించి వెంకటేష్‌ను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.