మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 28 సెప్టెంబరు 2021 (18:59 IST)

రాజకీయాల్లోకి ఆనందయ్య.. కొత్త పార్టీ స్థాపన దిశగా అడుగులు

కరోనా కష్టకాలంలో తన నాటు మందుతో అనేక మంది ప్రాణాలు కాపాడిన ఆనందయ్య ఇపుడు రాజకీయాల్లోకి ప్రవేశించనున్నారు. ఈయన త్వరలోనే ఏపీలో కొత్తగా రాజకీయ పార్టీని స్థాపించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈమేరకు ఆయన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. 
 
అన్ని కులాలను కలుపుకుని పార్టీ పెట్టాలని ఆనందయ్య యోచిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో ఆనందయ్య రధయాత్ర చేయనున్నారు. జాతీయ నేతల అండదండలతో బలహీన వర్గాలను కలుపుకుని వెళ్లాలని కసరత్తు చేస్తున్నారు. 
 
నెల్లూరులో కరోనా మందు తయారీతో ఆనందయ్య ప్రాముఖ్యత పొందారు. ఏపీవ్యాప్తంగా ఉచితంగా కరోనా మందును పంపిణీ చేశారు. జిల్లాలు, గ్రామాల్లో కూడా కరోనా మందును ప్రజలకు అందజేశారు.
 
ఏపీ ప్రభుత్వం నుంచి సహకారం లేదని కొన్ని సార్లు ఆవేదన వ్యక్తం చేసినా 13 జిల్లాల్లో కూడా ఆయుర్వేదం మందును పంపిణీ చేశారు. స్వయంగా ఆనందయ్య మందును తయారు చేశారు.