శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , సోమవారం, 18 అక్టోబరు 2021 (15:21 IST)

ఏపీలో వైసీపీ నుంచి బీజేపీలోకి చేరిక‌లు... ఉత్సాహం!

భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ‌లోకి విచిత్రంగా వైసీసీ నుంచి నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు చేరుతున్నారు. బద్వేలు  ఎన్నికల ప్రచారంలో ఈ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. వైసీపీ నుండి బిజెపి లోకి చేరికలు మొద‌ల‌య్యాయి అక్క‌డ‌. పార్టీలోకి స్థానిక నాయకులు శివ రెడ్డి, వారి అనుచరులు, రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు సమక్షంలో చేరారు. బీజేపీలో చేరుతున్నసందర్భంగా పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించారు. కలశ‌పాడులోని బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరూ  భారీ ప్రదర్శన నిర్వహించారు.
 
ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు మాట్లాడుతూ, బ‌ద్వేలు ఉప ఎన్నికల లో గెలుపు బిజెపిదే అని అన్నారు. కార్యకర్తలు మరింత ఉత్సాహంతో పని చేస్తున్నారని అభినందించారు. ఇదే ఊపు కొన‌సాగితే, బీజేపీ ఇక్క‌డ విజ‌యం పొందుతుంద‌ని సోము వీర్రాజు ఆశాభావం వ్య‌క్తం చేశారు. ఇక్క‌డ టీడీపీ, జ‌న‌సేన బ‌రిలో నుంచి త‌ప్పుకున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం, కాంగ్రెస్, బీజేపీ జాతీయ పార్టీలు వైసీపీతో త‌ల‌ప‌డుతున్నాయి. ఇందులో త‌మ విజ‌యం సునాయాస‌మ‌ని వైసీపీ ఎప్పుడో ప్ర‌క‌టించింది. అయినా, బీజేపీ, కాంగ్రెస్ త‌మ స‌త్తా చూపాల‌ని ఆరాట‌ప‌డుతున్నాయి.