1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 30 డిశెంబరు 2020 (19:54 IST)

నూతన సంవత్సర వేడుకలను ఇంటివద్దనే జరుపుకోవాలి: గుడివాడ ఆర్డీవో

కరోనా వైరస్ ఉన్నందున గుడివాడ డివిజన్ పరిధిలో గల ప్రజలందరు డిశంబరు, 31, జనవరి 1 తేదీల్లో  నూతన సంవత్సర వేడుకును ఇంటివద్దనే జరుపుకోవాలని ఆర్డీవో శ్రీనుకుమార్  విజ్ఞప్తి చేసారు.

బుధవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో శ్రీనుకుమార్ మీడియోతో మాట్లాడుతూ డివిజన్ పరిధిలో గల ప్రజలందరకు శుభాకాంక్షలు తెలియజేసారు. కరోనా వైరస్ సెకండ్ వేవ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నందున ప్రజలు తమ ఆరోగ్య రీత్యా ఇంటివద్దనే నూతన సంవత్సర వేడుకను నిర్వహించుకోవాలన్నారు.  

ఎవరూ బహిరంగ ప్రదేశాల్లో  గుమిగూడటం గాని కేకులు కట్ చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహించకూడదన్నారు. కొంత మంది  మద్యం సేవించి రోడ్లపై తిరగుతూ  ఇతరులను ఇబ్బంది  పెట్టడం మనం చూస్తున్నామని, అటువంటి వాటికి తావు లేకుండా ఇంటి వద్దనే నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలన్నారు.

ముఖ్యంగా యువత బైక్ లకు సైలర్సు తీసేసీ కేరంతలు కొడుతూ తిరగకూడదన్నారు. పోలీసులు కేసులు నమోదు చేస్తే యువతకు ఉద్యోగ అవకాశాలు  ఏర్పడే సమయంలో  సమస్యలు ఉత్పన్నవుతాయన్నారు.