మంగళగిరికి మర్కజ్‌కు లింకు.. హైఅలెర్ట్
గుంటూరు జిల్లా మంగళగిరికి నిజాముద్దీన్ మర్కజ్‌కు లింకు ఉన్నట్టు తేలడంతో పోలీసులతో పాటు.. అధికారులు హైఅలెర్ట్ ప్రకటించారు. మంగళగిరి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా సోకినట్టు తేలింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బాధితుడు నివసిస్తున్న టిప్పర్ బజార్‌లోని ఇంటి నుంచి మూడు కిలోమీటర్ల పరిధిని రెడ్‌జోన్‌గా ప్రకటించినట్టు పురపాలక సంఘ కమిషనర్ హేమమాలిని తెలిపారు.
అతడితోపాటు ఐదుగురు కుటుంబ సభ్యులను క్వారంటైన్‌కు తరలించినట్టు పేర్కొన్నారు. కేసు వెలుగు చూడడంతో ముందు జాగ్రత్త చర్యగా సమీపంలో కూరగాయల దుకాణాలు, మార్కెట్లను మూసివేయించారు. 144 సెక్షన్ విధించి, ఆ ప్రాంతం మొత్తాన్ని హైఅలర్ట్‌గా ప్రకటించారు.
మరోవైపు, బుధవారం ఏపీలో మొత్తం 67 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మంగళవారం రాత్రి వరకు 44గా ఉన్న కేసుల సంఖ్య ఒక్కసారిగా 111కు చేరుకుంది. రాష్ట్రంలో గుంటూరు జిల్లాలో అత్యధికంగా 20 కేసులు నమోదయ్యాయి.