కాకినాడ మేయర్ పావనిని దించేయాలంటున్న మహిళా కార్పోరేటర్లు
కాకినాడ కలెక్టరు కార్యాలయం చెట్ల కింద కూర్చున్న వీరు సామాన్యులు కాదు... కలెక్టర్ గారికి రేషన్ కార్డు కోసమో, పింఛను కోసమో దరఖాస్తు చేసుకోవడానికి వచ్చిన బాధితులు కాదు... వీరు సాక్షాత్తు మహిళా కార్పోరేటర్లు. కాకినాడ మేయర్ సుంకర పావని మేయర్ పీఠాన్నికదిలించే పనిలో భాగంగా ఇక్కడ ఇలా రౌండప్ చేశారు.
తూర్పుగోదావరి జిల్లా కలెక్టరుకి అవిశ్వాస తీర్మానం ప్రవేశం పెట్టాలని వినతిపత్రం ఇవ్వడానికి వచ్చి చెట్టు కింద ఇలా సేద తీర్చుకొంటున్నారు మహిళా కార్పోరేటర్లు. అవిశ్వాసానికి అధిష్టానం సుముఖంగా లేనట్లుగా కనిపిస్తోందని, అందుకే తమ పని ఆలస్యం అవుతోందని, ఇదే కార్పోరేటర్లు కొంత మంది చెప్పుకొంటున్నారు. మేయర్ పై అవిశ్వాసం నెగ్గితే, ఆ పదవికి సుంకర లక్ష్మీ ప్రసన్న పోటీలో ఉన్నట్లు తెలిసింది.