గురువారం, 28 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 1 మే 2024 (11:33 IST)

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

bank holiday
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోమారు పెన్షన్ల పంపిణీలో జాప్యం చోటుచేసుకుంది. పెన్షన్లను సకాలంలోనే పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథఅయంలో లబ్దిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పెన్షన్లు అందించాలని ఆదేశించింది. 
 
పెన్షన్ల పంపిణీకి సచివాలయ ఉద్యోగులను వినియోగించుకోవాలని సూచించింది. దీంతో మే ఒకటో తేదీన పెన్షన్లు పంపిణీ చేస్తామని ప్రబుత్వం ప్రటించింది. ఒకటో తేదీన పింఛన్లను బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని తెలిపింది. ఖాతాలు లేనివారికి ఇళ్లవద్దకే పంపిణీ చేస్తామని పేర్కొంది. 
 
ఈ విషయాన్ని పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ వెల్లిండించారు. కానీ, మే డే కావడంతో మే ఒకటో తేదీన బ్యాంకులకు సెలవు. దీంతో పంపిణీ చేయలేకపోయారు. 
 
మే ఒకటో తేదీన కార్మికల దినోత్సవం. 
 
ఈ రోజు బ్యాంకులకు సెలవు. ఈ క్రమంలో ప్రతి యేడాది మాదిరే మేడే నాడు బ్యాంకులకు సెలవని జిల్లా కలెక్టర్లు, పింఛను లబ్దిదారులు గమనించాలని, దీనిని దృష్టిలో ఉంచుకుని తగిన చర్యలు తీసుకోగలరని ఒక ప్రకటన జారీచేశారు. దీంతో ఈ రోజు పెన్షన్ల పంపిణీ ఆగిపోయింది. మే రెండో తేదీ గురువారం నుంచి పెన్షన్లను పంపిణీ చేయనున్నారు.