శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 12 మే 2018 (10:24 IST)

సొంత డబ్బుతో టీడీపీ కార్యకర్తలు పనిచేస్తారు: చంద్రబాబు కితాబు

అలిపిరిలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా కాన్వాయ్‌పై రాళ్ల దాడి ఘటన కలకలం రేపిన నేపథ్యంలో టీడీపీ కార్యకర్తల గుణాలను టీడీపీ చీఫ్, ఏపీ సీఎం చంద్రబాబు వెనకేసుకొచ్చారు. ఉండవల్లిలోని ప్రజాదర్బారు హాల్‌లో

అలిపిరిలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా కాన్వాయ్‌పై రాళ్ల దాడి ఘటన కలకలం రేపిన నేపథ్యంలో టీడీపీ కార్యకర్తల గుణాలను టీడీపీ చీఫ్, ఏపీ సీఎం చంద్రబాబు వెనకేసుకొచ్చారు. ఉండవల్లిలోని ప్రజాదర్బారు హాల్‌లో శుక్రవారం నిర్వహించిన టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ కార్యకర్తల సేవలను కొనియాడారు. 
 
సొంత డబ్బుతో టీడీపీ కార్యకర్తలు పనిచేస్తారని.. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనిచేస్తారని కార్యకర్తలన ప్రశంసించారు. నాలుగైదు రోజులు అలిగినా ఎన్నికల సమయానికి మళ్లీ అందరూ ఏకతాటిపైకి వస్తారని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో పోలింగ్ బూత్ దగ్గర అధికారులు నిలబడరని, కార్యకర్త మాత్రమే నిలబడతాడన్న సంగతిని గుర్తు పెట్టుకోవాలని నేతలకు సూచించారు. 90 శాతం కార్యకర్తలు కోరుకునేది గౌరవమేనని, వారికి అది దక్కేలా చూడాలని అన్నారు. 
 
ఉండవల్లిలోని ప్రజాదర్బారు హాలులో జరిగిన టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు చేసిన రాజీనామాలను జూన్ 2వ తేదీలోపు ఆమోదిస్తే ఉప ఎన్నికలు వస్తాయని, అదే జరిగితే వాటిని ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సీఎం స్పష్టం చేశారు. ఉప ఎన్నికల్లో టీడీపీ కచ్చితంగా పోటీ చేస్తుందని తేల్చి చెప్పారు.
 
వైసీపీ నేతలు ప్రత్యేక హోదా కోసం చిత్తశుద్ధితో రాజీనామా చేయలేదని, బీజేపీ-వైసీపీ లాలూచీలో భాగంగానే రాజీనామాలు చేశారని ఆరోపించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం కేంద్రాన్ని గట్టిగా నిలదీస్తున్నందుకే కేంద్రం కక్ష సాధిస్తోందని అన్నారు.