సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: శుక్రవారం, 11 మే 2018 (12:33 IST)

అటు జగన్ - ఇటు కెసిఆర్ ఇరుక్కున్న బాబు... ఎలా?

తెలంగాణా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, ఆంధ్రప్రదేశ్‌‌లో ప్రధాన ప్రతిపక్షనేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ కలిసి ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఇరుకున పడేశారు. పంటల సాగుకు అవసరమైన పెట్టుబడిని రైతుకు ఉచితంగా అందించే రైతుబంధు పథకానికి తెలంగాణా ప్

తెలంగాణా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, ఆంధ్రప్రదేశ్‌‌లో ప్రధాన ప్రతిపక్షనేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ కలిసి ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఇరుకున పడేశారు. పంటల సాగుకు అవసరమైన పెట్టుబడిని రైతుకు ఉచితంగా అందించే రైతుబంధు పథకానికి తెలంగాణా ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. రబీలో రూ.4 వేలు, ఖరీఫ్‌‌లో రూ.4 వేలు ఇస్తామని కెసిఆర్ ప్రకటించారు. దీనివల్ల 58 లక్షల మంది రైతులకు లబ్ది చేకూరుతోందని వెల్లడించారు. 
 
వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి యేడాది క్రితం ప్రకటించిన నవరత్నాలు పథకాల్లోనూ ఇదే ఉంది. పంటల సాగు కోసం యేడాదికి రూ.12 వేలు ఇస్తామని జగన్ ప్రకటించారు. పాదయాత్రలో ఇదే విషయాన్ని ప్రచారం చేస్తున్నారు. ఇంతలోనే కెసిఆర్ పథకాన్ని ఆచరణలో పెట్టారు. వాస్తవంగా రైతులు పంటల సాగుకు పెట్టుబడులు దొరక్క అప్పుల పాలవుతున్నారు. స్వామినాథన్ వంటి వాళ్ళు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ వ్యవసాయానికి పెట్టుబడులు ప్రభుత్వమే సమకూర్చాలని సిఫార్సు చేశారు. దీన్ని కెసిఆర్ ఆచరణలోకి తేవడం అభినందించాల్సిన విషయం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇది ఎంతవరకు సక్రమంగా అమలు చేస్తారనేది తరువాత అంశం.
 
ఇప్పుడు చంద్రబాబుకు సమస్య వచ్చిపడింది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక్కడ రైతులకూ ఇటువంటి పథకాన్ని ప్రవేశపెట్టాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడిందట. రుణమాఫీ అనేది ఒక యేడాదికి సంబంధించినది. ఐతే రైతు బంధు అనేది రైతుల వ్యవసాయానికి వెన్నుదన్నుగా నిలిచేది. మరి చంద్రబాబు నాయుడు ఈ పథకంపై ఎలా స్పందిస్తారో చూడాల్సిందే.