శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 7 ఫిబ్రవరి 2024 (12:21 IST)

3 నెలల్లో తెలంగాణ ప్రభుత్వం కాదు వైసిపి ప్రభుత్వం పడిపోతుంది: కె.ఎ పాల్

ka paul
వచ్చే 3 నెలల్లో తెలంగాణ ప్రభుత్వం కూలిపోతుందని వైసిపి ఎంపి విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ప్రజాశాంతి పార్టీ చీఫ్ కె.ఎ పాల్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసారు. తెలంగాణ ప్రభుత్వం పడిపోతుందని చెప్పడానికి మీరేమైనా బిజెపి తొత్తులా అంటూ మండిపడ్డారు.
 
తెలంగాణ ప్రభుత్వం పడిపోయే సంగతి పక్కనపెట్టండి, వచ్చే 3 నెలల్లో ఏపీలో వైసిపి ప్రభుత్వం వుంటుందా అని అన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనపై విమర్శనాస్త్రాలు సంధించారు. గద్దెనెక్కి ఐదేళ్లయినా ఇప్పటివరకూ ఏపీ రాజధాని ఎక్కడున్నదో చెప్పలేకపోయారు. మూడు రాజధానులు అంటూ ఐదేళ్లపాటు కాలయాపన చేసారు.
 
పోలవరం గురించి పట్టించుకోలేదు. ఏపీ ప్రత్యేక హోదాపై నరేంద్ర మోడిని ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు. భాజపాకి తొత్తులుగా పనిచేస్తూ వచ్చారనీ, ఆంధ్ర ప్రజల అభివృద్ధిని గాలికి వదిలేశారంటూ దుయ్యబట్టారు.