గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 9 ఆగస్టు 2023 (12:02 IST)

టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో మార్పులు... ఏకపై ఏడు పేపర్లు మాత్రమే...

exam
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో మార్పులు చేయనున్నారు. ముఖ్యంగా, పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఇప్పటివరకు ఆరు ప్రశ్నాపత్రాలు ఉంటే ఇకపై ఏడు ప్రశ్నపత్రాలు పెట్టనున్నారు. భౌతిక, రసాయన శాస్త్రాలు కలిపి ఒక పేపర్‌గా నిర్వహించనున్నారు. అలాగే, జీవశాస్త్రం పేపర్‌ను విడిగా పెడతారు. ఈ రెండింటిలో 35 మార్కులు సాధిస్తేనే ఉత్తీర్ణత చేశారు. కంపోజిట్ విధానాన్ని రద్దు చేయనున్నారు. అలాగే తెలుగు ప్రశ్నపత్రంలో ప్రతిపదార్థం, భావం రాసే ప్రశ్నను తొలగించారు. 
 
ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్త విద్యా విధానాన్ని అమలు చేయనున్నారు. భౌతిక, రసాయన శాస్త్రాలు కలిపి ఒక పేపర్‌గా 50 మార్కులకు ఒక ప్రశ్నపత్రం, మరో 50 మార్కులకు జీవశాస్త్రం ప్రశ్నపత్రాన్ని ఇస్తారు. రెండింటింలోనూ కలిపి 35 మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఒక్కో పేపర్‌కు రెండు గంటల సమయం కేటాయిస్తారు. 
 
మిగిలిన ఐదు సబ్జెక్టులకు మాత్రం ఒక్కో పేపర్‌ మాత్రమే ఉంటుంది. అలాగే, ప్రస్తుతం ఉన్న కాంపోజిట్ విధానాన్ని రద్దు చేశారు. 70/30 మార్కు విధానంలో తెలుగు/సంస్కృతం, ఉర్దూ/హిదీ, ఉర్దూ/అరబిక్, ఉర్దూ పార్టీ పరీక్షలు నిర్వహిస్తుండగా, ఇక నుంచి ఫస్ట్ లాంగ్వేజ్‌ ఒక్కటే వంద మార్కులకు ఉంటుంది ప్రతిపదార్థం, భావం రాసే ప్రశ్న తొలగించి దాని స్థానంలో ఒక పద్యం ఇచ్చి దానిపై నాలుగు ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కుల చొప్పున మొత్తం 8 మార్కులు ఉంటాయి. మంగళవారం ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమైన విద్యా మంత్రి బొత్స సత్యనారాయణ ఈ వివరాలను వెల్లడించారు.