1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 18 జనవరి 2022 (10:55 IST)

నేడు మహానటుడు ఎన్టీఆర్ 26వ వర్థంతి

వెండితెర ఇలవేల్పు, మహానటుడు దివంగత నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 26వ వర్థంతి వేడుకలు జనవరి 18వ తేదీన తెలుగు ప్రజలు నివశిస్తున్న ప్రతి గడ్డపై జరుగుతున్నాయి. ఒక నటుడుగానేకాకుండా దర్శకుడుగా, సినీ నిర్మాతగా, సినిమా స్టూడియో అధినేతగా, రాజకీయవేత్తగా, ముఖ్యమంత్రిగా ఇలా ఎన్నో రంగాల్లో ఎవరికీ సాధ్యంకాని రికార్డులను సృష్టించిన బముఖు ప్రజ్ఞాశాలి, తెలుగు ప్రజల ఆరాధ్య దైవం ఎన్టీఆర్. 
 
ఎన్టీఆర్ తన 44 యేళ్ల సినీ జీవితంలో 13 చారిత్రకాలు, 55 జానపద, 186 సాంఘిక, 44 పౌరాణిక చిత్రాల్లో నటించిన అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. అలా తెలుగు వెండితెరపై చెరగని ముద్ర వేసుకున్నాడు. అంతేకాకుండా, ఆయన హిందీలో కూడా 'నయా ఆద్మీ', 'చండీరాణి' అనే చిత్రాల్లో నటించారు. తెలుగులోనే కాకుండా తమిళంలోనూ ఆయన పలు చిత్రాల్లో నటించారు. 
 
అలాంటి ఎన్టీఆర్ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ వర్థంతి వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులతో పాటు ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి నివాళులు అర్పించారు. కాగా, ఏపీలోని టీడీపీ కార్యాలయంలో జరగాల్సిన పలు కార్యక్రమాలను పార్టీ అధినేత చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి లోకేశ్‌లు కరోనా వైరస్ బారినపడటంతో రద్దు చేశారు.