శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : శుక్రవారం, 27 ఆగస్టు 2021 (10:34 IST)

విజయవాడలో దారుణం: బంగారం కోసం వృద్ధురాలి హత్య

విజయవాడ నగరంలోని శివారు ప్రాంతంలో దారుణం జరిగింది. బంగారు నగలు కోసం ఓ వృద్ధురాలిని దుండగులు కర్రలతో కొట్టి చంపేసారు. ఈ దారుణ ఘటన కుందావారి కండ్రిగ ప్రాంతంలో చోటుచేసుకుంది.
 
పూర్తి వివరాలను చూస్తే.. భర్త, పెద్ద కుమారుడు చనిపోవడంతో సుబ్బమ్మ అనే వృద్ధురాలు స్థానిక సిండికేట్‌ బ్యాంకు సమీపంలో ఒంటరిగా వుంటుంది. పక్క పోర్షనుని అద్దెకి ఇచ్చింది. ఐతే గురువారం నాడు సాయంత్రం అద్దె ఇంటివారు బయటకు వెళ్లారు. ఈ సమయంలో ఓ దుండగుడు మోటార్ వాహనంపై వచ్చి ఇంటిలో చొరబడ్డాడు.
 
వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు చోరీ చేసేందుకు ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో పక్కనే వున్న ఇనుప రాడ్డు, రోకలి బండ తీసుకుని తలపై మోదాడు. దాంతో ఆమె కుప్పకూలిపోయింది. నగలు తీసుకుని పారిపోయాడు. రాత్రి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత అద్దెకున్నవారు చూస్తే వృద్ధురాలు రక్తపు మడుగులో పడి వుంది. ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కానీ ఆమె మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు.