శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , మంగళవారం, 24 ఆగస్టు 2021 (13:57 IST)

తాడేప‌ల్లిలో సీఎం... వీడియో కాన్ఫ‌రెన్స్ లో అగ్రి గోల్డ్ బాధితులు

అగ్రి గోల్డ్ బాధితులకు రెండో విడత చెల్లింపుల‌ను ఏపీ ప్ర‌భుత్వం వినూత్నంగా నిర్వ‌హించింది. తాడేప‌ల్లి సీఎం క్యాంప్ కార్యాల‌యంలో బాధితుల‌కు వారి ఖాతాల్లోకి 20 వేల రూపాయ‌లు చెల్లింపులు నేరుగా చేశారు. కానీ, అదే కార్య‌క్ర‌మాన్ని ఏపీలోని అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్ కార్యాల‌యాల‌లో వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా నిర్వ‌హించారు. ఏ జిల్లాకు ఆ జిల్లాలో ఎంత సొమ్ము బ‌కాయి ఉందో... ఆ మొత్తానికి చెక్కును డిస్ ప్లే చేశారు.  
 
20 వేల రూపాయలలోపు ఉన్న అగ్రిగోల్డ్‌ డిపాజిట్‌ దారుల ఖాతాల్లో 7లక్షల మందికి రూ. 666.84 కోట్లు జమ చేశారు. ఈ సంద‌ర్భంగా ముఖ్యమంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి నిర్వ‌హించిన వీడియో కాన్ఫ‌రెన్స్ లో రాష్ట్ర దేవాదయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ జే. నివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కొక్కిలిగడ్డ రక్షణ నిధి, మేయర్ భాగ్యలక్ష్మి, ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ తోలేటి శ్రీకాంత్,  వడ్డీ కార్పొరేషన్ ఛైర్పర్సన్ సైధు గాయత్రీ సంతోషి, భ‌ట్రాజు కార్పొరేషన్ ఛైర్పర్సన్ కూరపాటి గీతాంజలి త‌దితరులు పాల్గొన్నారు.

ఇప్పటికే రూ 10 వేల లోపు డిపాజిట్ దారులకు రూ 238.73 కోట్లు ఏపీ ప్ర‌భుత్వం చెల్లించింది. ఇక మూడో విడ‌త‌కు కూడా సన్నాహాలు చేస్తున్న‌ట్లు మంత్రి వెల్లంప‌ల్లి తెలిపారు.