బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 23 ఆగస్టు 2021 (20:05 IST)

సెప్టెంబరు ఒకటి నుంచి స్కూల్స్ పునఃప్రారంభం

తెలంగాణా రాష్ట్రంలో కూడా బడులు తెరుచుకోనున్నాయి. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి విద్యాసంస్థలు తెరిచేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్టు సమాచారం. 
 
విద్యా సంస్థలను ఓపెన్ చేయడంపై సీఎం కేసీఆర్ సోమవారం విద్యాశాఖ ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులతో పలు చర్చలు నిర్వహించిన సీఎం.. తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 1 నుంచి విద్యాసంస్థలను తిరిగి ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు.
 
విద్యాసంస్థలు ప్రారంభించవచ్చని.. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ, విద్యా శాఖ ఇచ్చిన నివేదిక ఆధారంగా సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే విద్యా సంస్థల పునః ప్రారంభం నేపథ్యంలో అందరూ కరోనా నియమ నిబంధనలు పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది. 
 
ఈ మేరకు తెలంగాణ సర్కార్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇక తెలంగాణ ప్రభుత్వం తాజా నిర్ణయంతో సెప్టెంబర్ ఒకటో తారీకు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యక్ష క్లాసులు ప్రారంభం కానున్నాయి. కాగా తెలంగాణలో కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గు ముఖం పట్టిన సంగతి తెల్సిందే.