సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 24 ఆగస్టు 2021 (13:53 IST)

కేసీఆర్ దత్తత గ్రామం చింతలపల్లిలో రేవంత్ దీక్ష

తెలంగాణ కాంగ్రెస్‌ పీసీసీ అధ్యక్షుడుగా పగ్గాలు చేపట్టిన నాటి నుంచి రేవంత్‌ రెడ్డి తనదైన దూకుడును కొనసాగిస్తూనే వున్నారు. ఇప్పటికే ఇంద్రవెళ్లి, రావిలాలలో దళిత, గిరిజన ఆత్మ గౌరవ సభలు నిర్వహించి, వాటిని విజయవంతం చేశారు. 
 
ఇపుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం తెలంగాణ సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన మూడు చింతలపల్లిలో దళిత, గిరిజన గౌరవ ఆత్మ గౌరవ దీక్ష చేపట్టనున్నారు. 
 
అయితే… ఈ దీక్షను ఈ రోజు, రేపు రెండు రోజుల పాటు కొనసాగించనున్నారు. రేపు సాయంత్రం 5 గంటలకు దీక్షను విరమించనునున్నారు. ఈ దీక్షలో రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ దళిత, గిరిజన నేతలు దీక్షలో కూర్చోనున్నారు.