సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , గురువారం, 26 ఆగస్టు 2021 (12:37 IST)

క‌రోనా కాలంలో చేనేత కార్మికుల‌కు జ‌గ‌నన్నఅండ‌

కరోనా విజృంభణ నేప‌ధ్యంలో చేనేత కార్మిల‌కు అండ‌గా వైసీపీ ప్ర‌భుత్వం చేయూతనిచ్చింద‌ని విజ‌య‌వాడ‌ న‌గ‌ర పాల‌క సంస్థ మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి పేర్కొన్నారు. బంద‌రు రోడ్డులోని రాఘ‌వ‌య్య  పార్క్ బాపు మ్యూజియంలో స‌హ‌కార సంఘం అధ్వ‌ర్యంలో  ఏర్పాటు చేసిన చేనేత హ‌స్త‌క‌ళ ఎగ్జిబిష‌న్ ను మేయ‌ర్ సంద‌ర్శించారు. 
 
ఈ సంద‌ర్భంగా మేయ‌ర్ మాట్లాడుతూ, కరోనా స‌మ‌యంలో ప‌నులు లేక ఇబ్బందిప‌డుతున్న చేనేత‌, చిరు వ్యాపారుల‌కు అండ‌గా జ‌గ‌నన్న ప్ర‌భుత్వం నిలిచింద‌న్నారు. చేయూత ప‌థ‌కం ద్వారా 24వేల రూపాయ‌ల  న‌గ‌దు అంద‌జేయ‌డం వారికి చాలా ఉప‌యోగ‌ప‌డిందన్నారు.
 
 చేనేత హ‌స్త‌క‌ళ ఎగ్జిబిష‌న్ వ‌చ్చే నెల 12 వ‌ర‌కు నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. చేనేత కార్మికుల ఎగ్జిబిష‌న్  స్టాల్స్ ని మేయ‌ర్ భాగ్య‌ల‌క్ష్మి ఎంతో ఆస‌క్తిగా తిల‌కించారు. ఇక్క‌డ నాణ్య‌మైన చీర‌లు,  జైపూర్ బెడ్‌షిట్స్‌, ఖాదీ ష‌ట్స్‌, సార‌గ్‌పూర్ పుడ్ ఐట‌మ్స్ బాగున్నాయ‌న్నారు.